శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 2 నవంబరు 2020 (09:58 IST)

ఒక చాయ్ పొయ్... చూద్దాం : మంత్రి హరీష్ రావు

హరీష్ రావు అంటే సాదా సీదానే.. ప్రజల్లో ఉండే నాయకుడు సామాన్య నాయకుడు అని దుబ్బాకలో మరోసారి నిదర్శనంగా చూపారు.

ఒక సామాన్యునిగా దుబ్బాక బస్టాండ్ సర్కిల్‌లో చాయ్ తాగి ముచ్చటించారు.. 'దుబ్బాకలో ఈ చాయ్ డబ్బా ఫేమస్ అంట కదా' అంటూ...! నీ దగ్గర చాయ్ బాగుంటుందట.. !!

చాయ్ తాగుతూ.. చాయ్ కొట్టు అతనితో ఆత్మీయంగా ముచ్చటించారు. అక్కడ ఉన్న యువత సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేసారు.

అందరిని పలకరించి.. చాయ్ తాగి మరోసారి తన సాదా సీదా నాయకునిగా, ప్రజల్లో ఉండే నాయకుడు అని నిదర్శనం అని చూపారు హరీష్ రావు.