శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జూన్ 2023 (09:30 IST)

తెలంగాణ ఫోక్‌ సింగర్‌ గుండెపోటుతో మృతి

Sai Chand
Sai Chand
తెలంగాణ ఫోక్‌ సింగర్‌, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌ సాయిచంద్‌ కన్నుమూశారు. గుండెపోటుతో అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయారు. కారుకొండలో తన ఫామ్‌హౌస్‌కి వెళ్లిన సాయిచంద్ అక్కడే గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన నాగర్‌కర్నూల్ గాయత్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం గచ్చిబౌలి కేర్‌ ఆస్పత్రికి తరలించారు. 
 
అప్పటికే సాయిచంద్‌ చనిపోయినట్లు కేర్‌ వైద్యులు ప్రకటించారు. మంత్రి హరీష్ రావు, బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా ఇతర ప్రముఖ నేతలు ఇప్పటికే హాస్పిటల్‌కు చేరుకున్నారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి భౌతికకాయం తరలించాలని భావిస్తున్నారు.
 
తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ పాటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఆయన మరణవార్త తెలంగాణ సమాజాన్ని కలిచివేస్తోంది. బీఆర్ఎస్ పార్టీతో సాయిచంద్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మరణ వార్త ముఖ్యనేతలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ గొప్పతనాన్ని కీర్తిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పథకాలపై ఎన్నో పాటలను రాశారు.