1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:50 IST)

హైదరాబాదులో త్వరలో నీరా స్టాల్స్ : మంత్రి శ్రీనివాస గౌడ్

హైదరాబాద్ లో ప్రభుత్వం త్వరలోనే నీరా పానీయం అమ్మకాలకు స్టాల్స్ ప్రారంభించనుందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ తెలిపారు.

ఆయన టూరిజం ప్లాజాలో మాట్లాడుతూ  నీరా అమ్మకాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని, రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో నీరాను సరఫరా చేస్తామని చెప్పారు. నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని అన్నారు.

హైదరాబాద్ నీరా అమ్మకాలు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు గౌడ సామాజికవర్గం తరుపున కృతజ్ఞతలు చెబుతున్నానని మంత్రి అన్నారు. నీరాకు లైసెన్స్ గౌడ కులానికి మాత్రమే ఇస్తామని, నీరాను గీయడం ,అమ్మడం గౌడలు మాత్రమే చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి అన్నారు.

నీరాలో అనేక ఔషధ గుణాలు ఉన్నందువల్ల షుగర్, మధుమేహ వ్యాధి కూడా తగ్గుతాయని, కంబోడియా,ఆఫ్రికా ,ఇండోనేషియా, మలేషియా, శ్రీలంకలో దీని ఉత్పత్తి ఎక్కువ గా ఉందని అన్నారు. అమెరికాలో ఈ మధ్యనే ప్రారంభించారని చెప్పారు.

తెలంగాణ లో వందల సంవత్సరాల నుండి నీరాను ఉత్పత్తి చేస్తున్నారని చెబుతూ అనేక వ్యాధుల కు ఔషధం గా పని చేస్తుందని కెమికల్ ల్యాబరేటరీ నుండి రిపోర్ట్ వచ్చిందన్నారు. సంప్రదాయ డ్రింక్స్ వలన ప్రజల ఆరోగ్యం కాపాడిన వాళ్ళం అవుతామన్నారు.

సీఎం కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ నీరా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని గత నెలలో గౌడ కులస్తులకు హామీ ఇచ్చారని మంత్రి చెప్పారు. ట్యాంక్ బాండ్ పరిసర ప్రాంతాల్లో మొదటి స్టాల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.