హైద్రాబాద్ లో పార్థీ గ్యాంగ్ అరెస్ట్

theft gang
ఎం| Last Updated: శనివారం, 17 ఆగస్టు 2019 (20:14 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్ధి గ్యాంగ్ ను శనివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ లో ఆరుగురు సభ్యులున్నారు. నిందితుల నుండి
రూ.22 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు.

గత నెల 26వ తేదీన హైద్రాబాద్ తార్నాకలో సతీష్ రెడ్డి ఇంట్లో దొంగతనాన్ని పోలీసులు చేధించారు. ఈ దొంగతనానికి
సంబంధించిన వివరాలను హైద్రాబాద్ రేంజ్ సీపీ అంజనీ కుమార్ మీడియాకు వివరించారు.

ఆరుగురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడితే వారిలో మనీషా డిస్కో, అలీ రాజా ఖాన్, రూపా బాయ్ లను అరెస్ట్ చేసినట్టుగా సీపీ చెప్పారు. ఈ గ్యాంగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2004 నుండి దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా ఆయన తెలిపారు.

నిందితుల నుండి
రూ. 22 లక్షల విలువైన 60 తులాల బంగారం, రెండు కిలోల వెండిని స్వాధీనం చేసుకొన్నట్టుగా సీపీ చెప్పారు.హైద్రాబాద్, సైబరాబాద్, వరంగల్, రేణిగుంట పోలీస్ స్టేషన్లలో ఈ గ్యాంగ్ ‌పై దాదాపుగా 12 కేసులున్నాయి.

మధ్యప్రదేశ్ నుండి హైద్రాబాద్ కు వచ్చి నిందితులు దొంగతనానికి పాల్పడేవారు.

కారులో వచ్చి దొంగతనం చేసి తిరిగి మధ్యప్రదేశ్ కు పారిపోయేవారని పోలీసులు చెప్పారు.ఈ గ్యాంగ్ లో మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా సీపీ అంజనీకుమార్ తెలిపారు.దీనిపై మరింత చదవండి :