శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (08:59 IST)

చలాన్లు రెట్టింపు కావు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

సెప్టెంబర్ 1వ తేదీనుంచి పెండింగ్ లో ఉన్న చలాన్లు రెట్టింపు అవుతాయంటూ సోషల్ మీడియాలో తిరుగుతున్న వార్త ఫేక్ న్యూస్ అని చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అది పూర్తిగా తప్పుడు వార్త అనీ.. పుకార్లను నమ్మొద్దని చెప్పారు.
 
“వాహనదారులకు విజ్ఞప్తి. మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను ఈనెల ఆఖర్లోగా అనగా 31-08-2019లోగా చెల్లించండి. లేనిచో.. 01-09-2019 నాటికి కొత్త చట్టం ప్రకారం సాఫ్ట్ వేర్ అప్ డేషన్ అయిన వెంటనే.. పాత జరిమానాలు అన్నీ ఆటోమేటిక్ గా కొత్త ధరలతో రెట్టింపు చేయబడును- కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ వింగ్, హైదరాబాద్ , తెలంగాణ” అంటూ.. వాట్సప్, ఫేస్ బుక్ లలో తిరుగుతున్న న్యూస్ ను ఎవరూ నమ్మొద్దని.. ఫేక్ న్యూస్ ను షేర్ చేయొద్దని కోరారు.
 
 సెప్టెంబర్ 1వ తేదీనుంచి … ఇప్పటికే చలాన్లు కట్టనివారికి కొత్త నిబంధనల ప్రకారం బిల్లులు మారిపోతాయన్న ప్రచారాన్ని సర్క్యులేట్ చేయొద్దన్నారు. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి ఆ బిల్లులు అలాగే ఉంటాయని.. కొత్త చట్టం అమలులోకి వస్తే.. ఆ చట్టం ప్రకారం అప్పటినుంచి చలాన్లు నమోదవుతాయని క్లారిటీ ఇచ్చారు.