బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (13:31 IST)

నవ వధువు అదృశ్యం.. బట్టల బ్యాగుతో వెళ్లిపోయిందని...

నవ వధువు అదృశ్యమైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...  కుత్బుల్లాపూర్ సర్కిల్ పద్మానగర్ పేజ్- 2కు చెందిన పీ. సైదులు కుమారుడు అశోక్‌కు అదే ప్రాంతానికి చెందిన చైత్రభార్గవి(18)తో పెద్దల సమక్షంలో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. నూతన దంపతులు కావడంతో అశోక్ సోదరి వెంకటరమణ వారితోనే ఇంట్లోనే ఉంటోంది.
 
అయితే ఈనెల 14వ తేదీన అశోక్ నైట్ డ్యూటీకి వెళ్లి 15వ తేదీన ఉదయం ఇంటికి వచ్చి గదిలో పడుకున్నాడు. ఉదయం 9 గంటల సమయంలో వెంకటరమణ.. తన కుమార్తెను స్కూల్ వద్దకు తీసుకెళ్లింది. 30 నిమిషాల్లో వెంకటరమణ తిరిగి ఇంటికి వచ్చేసరికి చైత్రభార్గవి ఇంట్లో కనిపించలేదు. 
 
దీంతో హాడావిడిగా వారు వాచ్ మెన్‌ను అడగ్గా బట్టల బ్యాగుతో చైత్ర వెళ్లిందని తెలిపారు. అది తెలిసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే.. ఇంట్లో ఏమైనా ఇబ్బందులతో ఆమె వెళ్లిపోయిందా.? లేక మరేదైనా కారణం ఉందా.? అనేది విషయం తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.