బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (16:02 IST)

తెలంగాణ రాష్ట్రంలో మరొ కొత్త పార్టీ.. డాక్టర్ వినయ్ నేతృత్వంలో?

తెలంగాణ రాష్ట్రంలో మరొ కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు సమాచారం అందుతోంది. డాక్టర్ వినయ్ నేతృత్వం లో ఈ కొత్త పార్టీ ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు హైదరాబాద్ బంజారా ఫంక్షన్ హాల్ లో తన మద్దతు దారులతో డాక్టర్‌ వినయ్ భేటీ అయ్యారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో అందరికి న్యాయం జరగాలనే డిమాండ్‌తో కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా వినయ్‌ కుమార్‌ అడుగులు వేస్తున్నారు.
 
మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ తనయుడే ఈ డాక్టర్ వినయ్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వినయ్ కుమార్‌.. ఇవాళ సాయంత్రం ఆ పార్టీ కి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. 
 
కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం... కొత్త పార్టీ ఏర్పాటు చేయడంపై కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. డిసెంబర్ లో కొత్త పార్టీ పేరు ను ప్రకటించే దిశగా డాక్టర్ వినయ్ కుమార్ అడుగులు వేస్తున్నారు.