మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 8 ఏప్రియల్ 2020 (16:51 IST)

ఉద్యోగులకు ఒక్క పైసా కూడా తగ్గించను: ఎన్టీవీ చైర్మెన్ నరేంద్ర చౌదరి, జర్నలిస్టు సంఘాలు అభినందనలు

ఎన్టీవీ చైర్మన్- నరేంద్ర చౌదరి
కరోనా వైరస్ ప్రభావంతో దేశంలోను ప్రపంచంలోను ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో తెలిసిందే. లౌక్ డౌన్ వలన ఒక్క రంగమనే కాకుండా... అన్ని రంగాలు బాగా దెబ్బతిన్నాయి. మళ్లీ అంతా సెట్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఉద్యోగుల్లో ఒక రకమైన భయం మొదలైంది. ఆల్రెడీ కొన్ని సంస్థలు ఉద్యోగులను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఎవరి ఉద్యోగాలు ఉంటాయో.. ఎవరి ఉదోగ్యాలు పోతాయో.. తెలియక ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. 
 
అదే మీడియా రంగంలో అయితే... ఈ టెన్షన్ కాస్త ఎక్కువుగానే ఉందని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే... ఈ భయం రోజురోజుకు మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే ప్రముఖ మీడియా సంస్థలతో పాటు ఇంకొన్ని పత్రికలు పేజీల సంఖ్యను కుదించుకున్నాయి. ఇక భవిష్యత్తులో జీతాల్లో కూడా కోత విధిస్తారని.. ఉద్యోగులను తొలగిస్తారనే ప్రచారం మీడియా సర్కిల్సులో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ సమయంలో ఎన్టీవీ యాజమాన్యం తమ ఉద్యోగులకు భరోసానిచ్చే ప్రకటన చేసింది. 
 
సంస్థకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా జీతాల్లో కోత విధించే ప్రసక్తే లేదని.. నష్టాలను భరించి సంస్థలో పని చేసే ఉద్యోగులు.. వారి కుటుంబాలకు ఈ కష్టకాలంలో అండగా నిలవాలని ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి నిర్ణయించారు. ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి ప్రకటనతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించి... తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్టీవీ ఉద్యోగులతో పాటు జర్నలిస్టు మిత్రులు, జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. యావత్ పాత్రికేయ ప్రపంచం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది.. హర్షిస్తోంది.