ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (15:24 IST)

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ అవసరం లేదు

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ఇక లేనట్లే. తెలంగాణలో రాత్రి కర్ఫ్యూపై డీహెచ్ డాక్టర్ డి శ్రీనివాస్ రావు క్లారిటీ ఇచ్చారు. రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కోవిడ్ వ్యాప్తి లేదన్నారు. పాజిటివిటి రేటు 10 శాతం దాటితే మాత్రమే కర్ఫ్యూ అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటి రేటు 3.16 శాతం ఉందని వివరణ ఇచ్చారు. 
 
అయితే ఈ నెల 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. వారం రోజులుగా లక్షకుపైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా శ్రీనివాస్ తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందన్నారు. మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి కరోనా కిట్లను పంపిణీ చేసినట్లుగా వెల్లడించారు. 
 
18 ఏళ్లోపు ఉన్నవారిలో 59 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. రాష్ట్రంలో 2.16లక్షల మందికి ప్రికాషన్ డోసులు ఇచ్చినట్లుగా డీహెచ్ శ్రీనివాస్ తన నివేదికలో వెల్లడించారు.