శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (17:41 IST)

తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బీజేపీ ఎంపీ అరవింద్ ఓపెన్ ఛాలెంజ్

తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస, విపక్ష బీజేపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ళు  హెచ్చుమీరిపోతున్నాయి. నిజామాబాద్‌‍లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కారుపై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడితో ఈ రెండు పార్టీల మధ్య ఒక్కసారిగా వేడిరాజుకుంది. ఇటు బీజేపీ, అటు తెరాస నాయకుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చెలరేగింది. కర్రలు, బండలతో పరస్పరం దాడులకు చేసుకున్నారు. ఈ దాడిలో ఎంపీ అరవింద్ కారు పూర్తగా ధ్వంసమైంది. 
 
ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెరాస పార్టీ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో చిత్తుగా ఓడిస్తానని జీవన్ రెడ్డికి సవాల్ విసిరారు. అంతేకాకుండా, ఈ దఫా కేసీఆర్ నుంచి టిక్కెట్ తెచ్చుకో చూద్ధాం అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.