శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 మే 2020 (11:18 IST)

హైదరాబాద్‌లో సరి-బేసి విధానంలో దుకాణాలకు అనుమతి...

హైదరాబాద్ నగరంలో సరిబేసి విధానంలో దుకారణాలకు అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనలో గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఈ విధానంలో దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. 
 
ఈ మేరకు ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో బల్దియా అధికారులు పర్యటిస్తున్నారు. దుకాణాలు తెరిచేందుకు బల్దియా అధికారులు అనుమతులు ఇస్తున్నారు. సరి - బేసి విధానం పాటించకపోతే దుకాణాలు మూసివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రతి దుకాణం వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దుకాణదారు మాస్క్‌ ధరించి శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 
 
మాస్క్‌ ధరించిన వినియోగదారుకే సరుకులు ఇవ్వాలని ఆదేశించారు అధికారులు. మాస్కులు ధరించకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని బల్దియా అధికారులు స్పష్టం చేశారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతున్న విషయం తెల్సిందే. 50 శాతం మంది ప్రయాణికులతో బస్సులు నడిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులకు ప్రయాణికుల నుంచి వచ్చే డిమాండ్ మేరకు రాష్ట్ర సరిహద్దుల వరకు బస్సులు నడపాలని భావిస్తున్నారు.