ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: గురువారం, 2 ఆగస్టు 2018 (15:49 IST)

జాతీయ పతాక రూపకర్త పింగళికి జనసేన అధ్యక్షుడు నివాళి

మన జాతీయ పతాకాన్ని రూపొందించిన స్వర్గీయ పింగళి వెంకయ్యకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. గురువారం స్వర్గీయ పింగళి వెంకయ్య జయంతి. ఈ సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్ మాదాపూర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని నిర

మన జాతీయ పతాకాన్ని రూపొందించిన స్వర్గీయ పింగళి వెంకయ్యకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. గురువారం స్వర్గీయ పింగళి వెంకయ్య జయంతి. ఈ సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్ మాదాపూర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకయ్య చిత్రపటానికి పవన్ కళ్యాణ్ పూలమాల వేసి, జ్యోతి వెలిగించి అంజలి ఘటించారు.
 
స్వాతంత్య్ర పోరాటంలో వెంకయ్య త్యాగ నిరతిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం తదితరులు పాల్గొన్నారు. 
 
జనసేన కరదీపిక ఆవిష్కారం
 
జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు, లక్ష్యాలను తెలియచేసే కరదీపికను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురువారం ఆవిష్కరించారు.