సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 30 జులై 2018 (22:26 IST)

రాజధాని నిర్మాణాలను పవన్ ఎలా అడ్డుకుంటారో చూస్తాం: కళా వెంకటరావు

అమరావతి: కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేనని జగ్గంపేట సభలో వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం దారుణమని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకట్రావ్ ఆక్షేపించారు. కాపులపై ద్వేషం వెళ్లగక్కడం సరికాదని ఆదివారం విడుద

అమరావతి: కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేనని జగ్గంపేట సభలో వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం దారుణమని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకట్రావ్ ఆక్షేపించారు. కాపులపై ద్వేషం వెళ్లగక్కడం సరికాదని ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ పేర్కొన్నారు.


చంద్రబాబు నాయుడు ప్రతికులాన్ని మోసం చేశారని జగన్ అనడాన్ని తప్పుబట్టారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితమంతా అన్నికులాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారన్నారు. కాపులకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగా తానేమీ చేయలేనని జగన్ చెప్పడం కాపులకు అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు. ఆ నైజం జగన్‍లో స్పష్టంగా కన్పిస్తోందని కళావెంకటరావు విమర్శించారు. 
 
బీసీలకు ఇబ్బంది లేకుండానే కాపు రిజర్వేషన్ల చేయాలని బిల్లు చేసి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు, జగన్-పవన్‌లు బీజేపీ డైరెక్షన్లో నడుస్తోన్నారని ఆరోపించారు కాపు రిజర్వేషన్లపై మోడీని ఒప్పించాలని కళా వెంకటరావు డిమాండ్ చేశారు, రాష్ట్ర పరిధిలో చేయాల్సింది చేసి.. కాపు రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామన్నారు, లీగల్ స్క్రూటినీలో కూడా నిలబడేలా కాపు రిజర్వేషన్ బిల్లు రూపొందించామని స్పష్టం చేశారు బీసీలకు వీసమెత్తు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్లు అమలు చేయమనే కోరుతున్నామన్నారు, వైఎస్ హయాంలో కాపులు, బలిజలకు ఇవ్వాల్సిన సీట్లను వేరే వారికి ఇచ్చారని కళావెంకటరావు గుర్తు చేశారు. మోడీ డైరెక్షన్లోనే జగన్ ఈ కామెంట్లు చేశారని మంత్రి ఆరోపించారు. 
 
తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం దాటినా కూడా కాపులకు రిజర్వేషన్లు కల్పించడం సబబని గతంలో రాష్ట్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన జగన్ ఇప్పుడు మాటమార్చడం తగదన్నారు, కాపులకు రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తున్న మాపై విమర్శించడం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా యూ టర్స్ తీసుకున్నారని విశదమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న కాపు రిజర్వేషన్‌ను ఆమోదింపచేయడంలో ఒత్తిడి తేలేక జగన్ పిరికిపందలాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
 
పవన్ తీరుపై కళా వెంకటరావు ఆగ్రహం
రాజధాని కట్టకుండా చేస్తానని, ఆపేస్తామనే రీతిలో పవన్ మాట్లాడ్డం సరికాదని కళా వెంకటరావు పేర్కొన్నారు రాజధాని నిర్మాణాలను అడ్డుకుంటామని పవన్ ఎలా అంటున్నారని కళావెంకటరావు ప్రశ్నించారు. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే ముందు విధి విధానాలు చెప్పడం ఆనవాయితీ అని పేర్కొన్నారు పార్టీ పెట్టి నాలుగేళ్లైనా జనసేన తన విధి విధానాలను ప్రకటించారా..? అని ప్రశ్నించారు ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంటే అభివృద్ధి చేస్తామని చెప్పాలి కానీ విష బీజాలు నాటడం సరికాదన్నారు. 
 
విభజన ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక కష్టాలు, లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధిపథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజలంతా జేజేలు పలుకుతున్నారు. అయితే కళ్లు ఉండి చూడలేని కబోదిలా పవన్ వ్యవహార శైలి కనబడుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పట్ల సంతృప్తిగా ఉన్నత స్థితిలో ప్రాంతీయ భేదభావాలు రెచ్చగొట్టాలనుకుంటున్న పవన్ ఆటలు ఉత్తరాంధ్ర ప్రజల ముందు సాగవన్నారు. ఉద్దానం లాంటి నిజమైన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి మేము ఎప్పుడూ సిద్ధమేనని కళా వెంకటరావు స్పష్టం చేశారు. అంతేగానీ ప్రజలకు లేని ఇబ్బందులను, సమస్యలను కల్పించి లబ్ది పొందాలనుకోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.