ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జులై 2న ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు. రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. జులై 2, 3 తేదీల్లో మోడీ నగరంలోనే ఉండి రాజ్‌భవన్‌లో బస చేస్తారు.
తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారు. జులై 1న మధ్యాహ్నం 3గంటలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకుంటారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయం వద్ద భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శంషాబాద్‌లో కిలోమీటరు దూరం నిర్వహించే రోడ్‌షోలో నడ్డా పాల్గొంటారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదారబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్టీ అగ్రనేతలంతా హైదరాబాద్‌కు తరలివస్తున్నారు.