శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (10:16 IST)

మరో 2 రోజులు వర్షాలే - భాగ్యనగరిలో రెడ్ అలెర్ట్

హైదరాబాద్ నగరంలో రెండు రోజులు పాటు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ నగర వ్యాప్తంగా భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు, రేపు  రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 
 
దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. విరామం లేకుండా 6 నుంచి 8 గంటల పాటు వర్షం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ అధికారులు కోరారు. ఎలాంటి సాయం కోసమైనా 0402955 5500 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. 
 
ఒకవైపు రుతుపవనాలతో పాటు.. మరోవైపు, దట్టంగా అలుముకున్న క్యూములో నింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఈ కారణంగా రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్‌తో పాటుగా 16 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. అయితే ప్రస్తుతం