తెలంగాణలో పాముల కోసం రెస్క్యూ సెంటర్
మేడ్చల్ జిల్లా భౌరంపేట్‌లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ.1.40 కోట్లతో స్నేక్ రెస్క్యూ సెంటర్ ఏర్పాటైంది. రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దీనిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలిసారిగా 35 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, మరో నెల రోజుల్లో నిర్మల్‌లో కోతుల సంరక్షణ కేంద్రాన్నీ ఏర్పాటు చేస్తామన్నారు.
పాములను చూసి భయపడొద్దని, స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారమిస్తే వాటిని సురక్షితంగా ఈ కేంద్రానికి తరలిస్తారన్నారు.
చెన్నైలోని గిండి స్నేక్ పార్క్‌కు దీటుగా భౌరంపేట్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 180 మంది స్నేక్ సొసైటీ సభ్యులు సహకారం అందిస్తున్నారని మంత్రి చెప్పారు.