Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వనపర్తి జిల్లాలో బోల్తాపడిన ఆర్టీసీ బస్సు - 15 మందికి గాయాలు

Written By ఠాగూర్
Published: ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (11:24 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అయితే, అందరికీ స్వల్పగాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జాతీయ రహదారి ఎన్.హెచ్.44 రోడ్డుపై జరిగింది. 
 
కొత్తకోట బైపాస్ సమీపంలో యాదగిరి గుట్టకు చెందిన ఆర్టీసీ బస్సు టీఎస్ 30 జడ్ 0015గా గుర్తించారు. ఈ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. యాదగిరి గుట్ట నుంచి తిరుపతికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. 
 
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కొత్తకోట ఎస్ఐ, అతని బృందం సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అన్నీ చూడండి

Bigg Boss Telugu 10: డబుల్ ఎలిమినేషన్... మనస్సు విప్పిన చరణ్ మహాదేవ్

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ప్రేమంటే కేవలం రొమాన్స్ కాదు : శోభిత ధూళిపాళ్ల

K. Raghavendra Rao: నా వైఫ్ మిస్సింగ్ నుంచి అరెరే వినవా.. సాంగ్ రిలీజ్ చేసిన కె.రాఘవేంద్రరావు

Pooja Hegde: శ్రీ శ్రీ చిత్రం నుంచి 36 ఏళ్ళ పూజా హెగ్డే పుట్టినరోజు పోస్టర్

తర్వాతి కథనం
Show comments