గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
హైదరాబాద్, ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. కరీంనగర్ టు డిపోకు చెందిన బాబు అనే డ్రైవర్ సరూర్ నగర్‌లో జరిగిన సకల జనుల సమావేశానికి హాజరయ్యాడు. ఆర్టీసి సమ్మెపై ప్రతిపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకులు చేస్తున్న ప్రసంగాలు వింటున్న బాబుకు గుండెపోటు రావడంతో తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ బాబు కొద్దిసేపటి క్రితమే మృతి చెందాడు. సమ్మె పట్ల కలత చెందిన బాబు గుండెపోటుకు గురై మృతి చెందాడని కార్మికులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.