గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (10:37 IST)

రైతు బంధు పథకం కింద రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రైతుబంధు సాయం పంపిణీ కొనసాగుతుంది. మంగళవారం పథకం కింద 2.09 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.651.07 సాయం జమకానుంది. 
 
ఇప్పటివరకు మొత్తం 59.70లక్షల మంది రైతులకు అందగా ఆయా రైతుల ఖాతాల్లో రూ.6,663.79 కోట్లు జమైంది. వానాకాలం సీజన్‌లో 63.25 లక్షల మంది రైతులను అర్హులుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాది మొత్తం కోటిన్నర ఎకరాలకు రైతుబంధు లభించనుంది. 
 
గత ఏడాదితో పోల్చితే 2,81,865 మంది కొత్త రైతులకు రైతుబంధు వర్తిస్తుండగా.. 66,311 ఎకరాల భూమి అదనంగా సాగవుతుంది. ఈ నెల 15న నుంచి రైతులకు పంట సాయం అందుతుండగా.. ఈ నెల 25వ తేదీ వరకు పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రూ.5 వేల చొప్పన సాయం అందనుంది.