ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2023 (17:14 IST)

మొరిగిన శునకం.. భయంతో మూడో అంతస్థు దూకేశాడు.. పరిస్థితి విషమం

ఫుడ్ డెలివరీ బాయ్ మూడో అంతస్థు నుంచి దూకేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ బాయ్‌కి పెంపుడు కుక్క మొరగడంతో భయంతో భవనం మూడో అంతస్థు నుంచి దూకి తీవ్ర గాయాలపాలయ్యాడు.
 
వివరాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో పనిచేస్తున్న మహ్మద్ రిజ్వాన్ (23) పార్శిల్ డెలివరీ చేసేందుకు బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్ భవనానికి వెళ్లాడు. ఫ్లాట్ తలుపు తట్టినప్పుడు, ఒక జర్మన్ షెపర్డ్ శునకం అరుస్తూ అతని వైపుకు వచ్చింది. 
 
దీంతో భయంతో రిజ్వాన్ మూడో అంతస్థు నుంచి దూకి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆపై ఫ్లాట్ యజమాని శోభన అంబులెన్స్‌కు ఫోన్ చేసి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కి తరలించారు.
 
నగరంలోని యూసుఫ్‌గూడ ప్రాంతంలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన రిజ్వాన్‌ పరిస్థితి విషమంగా ఉంది. రిజ్వాన్ సోదరుడు మహ్మద్ ఖాజా గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.