తెలంగాణాలో జూలై నుంచి స్కూల్స్ రీఓపెన్ - తల్లిదండ్రుల్లో టెన్షన్ టెన్షన్
కరోనా వైరస్ మహమ్మారి కాలంలో తెలంగాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పాఠశాలలను రీఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో విద్యార్థులతో పాటు.. వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. దీంతో సంపూర్ణ లాక్డౌన్ ఎత్తివేశారు. అదేసమయంలో జూలై ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ రీ ఓపెన్ చేయాలని ఇటీల జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది.
దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చిన ఈ పరిస్థితుల్లో తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేయడం మంచి పరిణామమే అయినప్పటికీ, జూలై ఫస్ట్ నుంచి భౌతిక తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది.
'థర్డ్ వేవ్ ఆరు నుంచి ఎనిమిది వారాల్లో ప్రభావం చూపిస్తుందని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో భౌతిక తరగతులను నిర్వహించడం ఎంత మాత్రం మంచిది కాదని.. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది' హెచ్ఎస్‌పీఏ ఓ ప్రకటనలో పేర్కొంది.