శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 8 మే 2017 (05:13 IST)

నాకు ఇచ్చిన సుఖం మా వాళ్లకూ ఇవ్వు అంటూ ఒత్తిడి చేసిన దొంగ ప్రియుడు

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఒక తెలుగు సినిమాలో కొత్తగా పెళ్లయిన భర్త తన స్నేహితులకు తన వస్తువులను ఇచ్చివేసినట్లుగానే తన భార్యను కూడా వారికి ఇవ్వడానికి సిద్ధపడటమే కాకుండా భార్యను అలా చేయవలసిందిగా బలవంతపెడతాడు కూడా.. మగాడి దౌష్ట్యం ఇంత ఘోరంగా ఉందా అ

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఒక తెలుగు సినిమాలో కొత్తగా పెళ్లయిన భర్త తన స్నేహితులకు తన వస్తువులను ఇచ్చివేసినట్లుగానే తన భార్యను కూడా వారికి ఇవ్వడానికి సిద్ధపడటమే కాకుండా భార్యను అలా చేయవలసిందిగా బలవంతపెడతాడు కూడా.. మగాడి దౌష్ట్యం ఇంత ఘోరంగా ఉందా అంటూ సినిమా చూసిన మహిళలు వణికిపోయారు. సరిగ్గా అలాంటి ఉదంతం మళ్లీ తాజాగా చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు పెళ్లికాకుండానే ప్రియుడు తన ప్రియురాలని తనతో పాటు స్నేహితులకు కూడా పంచిపెట్టాలంటూ ఒత్తిడి చేయడమే ఈ కథనంలోని ట్విస్ట్. 
 
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో బ్యూటీ పార్లర్‌ నడిపించే యువతి కొంతకాలంగా కొంపల్లికి చెందిన ప్రీతమ్‌రెడ్డితో చనువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఈ నెల 6న ప్రీతమ్‌రెడ్డి తన ఇంటికి యువతిని రప్పించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన ఇద్దరు స్నేహితులను ఇంటికి పిలిచి వీరికి కూడా సహకరించమని యువతిపై ఒత్తిడి చేశాడు. 
 
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంటికి పిలిచి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా మరో ఇద్దరు స్నేహితులకూ సహకరించమని ఒత్తిడి చేయడంతో భంగపడిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
ప్రతిరోజూ ఇలాంటి వార్తలని పత్రికలలో, టీవీలలో చూస్తూనే ఉంటాం. మగాడిని నమ్మితే మగాడి ప్రేమను నమ్మితే చాలా సందర్భల్లో అది ప్రేమ నుంచి  కామంవైపుకు మళ్లి మోసపోతున్న వైనం పదే పదే తెలుస్తూనే ఉంది. కానీ ప్రేమ విషయంలో మగాళ్లను అంత గుడ్డిగా ఎందుకు అమ్మాయిలు నమ్ముతున్నారన్నది  అర్థం కాని విషయం. అందులోనూ ఆర్థిక స్వాతంత్ర్యం అంతో ఇంతో సాధించి తమ కాళ్లమీద తాము గడుపుతున్న అమ్మాయిలు ఎందుకిలా మోసపోతున్నారనేది బాహుబలియన్ ప్రశ్నే మరి.