శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (14:05 IST)

స్వాతిని చితక్కొట్టిన మధుకర్ బంధువులు... ఆమె అమెరికాలో చంపేసిందంటూ...

తెలంగాణ యాదాద్రి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుకర్ మృతదేహం స్వగ్రామం జనగామకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అతడి భార్య కూడా మధుకర్ భౌతిక కాయాన్ని చూసేందుకు వచ్చింది. దీనితో మధుకర్ బంధువులు హఠాత్తుగా ఆమెపై దాడికి దిగారు. ఆమెపై దాడి చేశారు. ఆమె అర

తెలంగాణ యాదాద్రి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుకర్ మృతదేహం స్వగ్రామం జనగామకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అతడి భార్య కూడా మధుకర్ భౌతిక కాయాన్ని చూసేందుకు వచ్చింది. దీనితో మధుకర్ బంధువులు హఠాత్తుగా ఆమెపై దాడికి దిగారు. ఆమెపై దాడి చేశారు. ఆమె అరుపులు, కేకలు పెట్టడంతో స్థానికులు వారిని అడ్డుకుని స్వాతిని అక్కడ నుంచి పంపించి వేశారు. 
 
తన కుమారుడు మధుకర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదనీ, అతడి భార్య స్వాతి వేధింపుల వల్ల తమ కుమారుడు బలవన్మరణం చెంది వుంటాడని ఆరోపిస్తున్నారు. కాగా స్వాతి తనకు ప్రాణ హాని వుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలావుంటే ఈ నెల 4వ తేదీన మధుకర్‌రెడ్డి అమెరికాలో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.