గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (13:11 IST)

అయ్యో... నాన్నా డబ్బు కోసం నిన్ను కొట్టానా? చచ్చిపోతున్నానంటూ కొడుకు సూసైడ్

మద్యం మత్తులో తండ్రిని బండరాయితో కొట్టాడు ఆ కొడుకు. పింఛన్ డబ్బు కావాలంటూ తండ్రిపై దాడి చేసాడు. దాంతో తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.

 
పూర్తి వివరాలను చూస్తే... నిజామాబాద్ నాగిరెడ్డి పేట మండలంలోని ఎర్రారం గ్రామంలో సతీష్ అనే వ్యక్తి తన తండ్రి వద్ద పింఛన్ డబ్బులు కోసం గొడవపడ్డాడు. తండ్రి అంగీకరించకపోయేసరికి బండరాయితో తలపై మోదాడు. దీనితో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇరుగుపొరుగువారు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

 
తెల్లారాక... మద్యం మత్తు దిగి జరిగిన ఘటన తెలుసుకుని పశ్చాత్తాప పడ్డాడు. తన తండ్రిపై దాడి చేసినందుకు ఆవేదన, భయంతోనూ, తనను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.