సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (07:36 IST)

హైదరాబాద్‌లోని ర్యాడిసన్ బ్లూ ప్లాజ్ పబ్ లైసెన్సు రద్దు

radisson blu plaza
హైదరాబాద్ నగరంలో ఏళ్ళ తరబడి నడుస్తున్న రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ పబ్ లైసెన్సును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఈ హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో అనేక మంది సినీ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల పిల్లలను పట్టుబడ్డారు. 
 
ఇలాంటివారిలో మెగా బ్రదర్ కుమార్తె నిహారిక, బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరుల వారసులతో పాటు 150 మందికిపైగా ఉన్నారు. వీరందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించి నోటీసులిచ్చి పంపించేశారు. పైగా, ఈ కేసును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ హోటల్‌లో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ర్యాడిసన్ హోటల్‌ పైఅంతస్తులోనే డ్రగ్స్ లభించిన పబ్ ఉంది. ఈ పబ్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ కేసులో సెలెబ్రిటీల బంధువుల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఈ హోటల్ లైసెన్సుతో పాటు పబ్, బార్ అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, ఆ హోటల్‌కు ఇచ్చిన పబ్, లిక్కర్ లైసెన్సులను కూడా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.