హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా శ్రీనివా్‌సయాదవ్?
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివా్‌సయాదవ్ పోటీ చేయడం ఖాయమైంది. అదే నియోజకవర్గానికి చెందిన గెల్లును తమ అభ్యర్థిగా బరిలో దించబోతున్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్యులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
వాస్తవానికి హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డిని టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేయించాలని కేసీఆర్ తొలుత అనుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్‌రెడ్డి.. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయినా 60 వేలకు పైగా ఓట్లు సాధించడం, ఆయన సామాజికవర్గం కలిసి వచ్చే అంశాలుగా భావించారు.
కాంగ్రె్‌సలో ఉన్న కౌశిక్‌రెడ్డిని టీఆర్‌ఎ్‌సలో చేర్చుకుంటామనే విషయాన్ని నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తనను ప్రగతి భవన్‌లో కలిసినప్పుడు ఆయన స్వయంగా చెప్పారు.
హుజూరాబాద్ అభ్యర్థి అనుకున్న కౌశిక్‌రెడ్డిని తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేశారు. కేసీఆర్ నిర్ణయం మార్చుకోవడం వెనుక పలు కారణాలున్నాయని టీఆర్‌ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.