ఎన్నికల కోసమే హుజూరాబాద్‌లో దళిత బంధు : కేసీఆర్
తెలంగాణ ఉద్యమ సమయంలో తన శరీర భాగాలపైనా కొందరు అవహేళన చేశారని, అయినా ముందుకెళ్లామని కేసీఆర్ అన్నారు. తనను తిట్టిన తిట్లు ప్రపంచంలో ఎవరినీ తిట్టుండరన్నారు. ఎవరు ఏమనుకున్నా తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించామని చెప్పారు.
తన ముక్కుతో వాళ్లకు పనేంటోనని కేసీఆర్ ఘాటుగా స్పందించారు. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు పైలెట్ ప్రాజెక్ట్ పెట్టారంటూ వస్తున్న విమర్శలపై కూడా సీఎం కేసీఆర్ స్పందించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కచ్చితంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.
ఎన్నికల కోసమే హుజూరాబాద్‌లో దళిత బంధు పెట్టామనేది వందకు వంద శాతం నిజం.. పెట్టిందే అందుకోసమనేనన్నారు. గెలవాలంటే పెట్టుకోవాలి కాబట్టి పెట్టామని చెప్పారు. గెలవని వారే హామీలు ఇస్తుంటే.. గెలిచే పార్టీ తమదని.. ఎందుకు ఇవ్వమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన ఫైర్ అయ్యారు.