5 వేలకు పైచిలుకు ఓట్లు పొందిన కారును పోలిన గుర్తులు
మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తేరుకోలేని షాకులు ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులకు ఏకంగా ఐదు వేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. ఈ కారణంగా అధికార తెరాస పార్టీ మెజార్టీ తగ్గింది.
ఈ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు తమ ఆధిక్యాన్ని తగ్గించాయని తెరాస నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. రోటీ మేకర్ గుర్తుపై పోటీ చేసిన మారమోని శ్రీశైలం యాదవ్‌కు ఏకంగా 2407 ఓట్లు వచ్చాయి. అలాగే, రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసిన యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ 1847 ఓట్లు సాధించారు. టెలివిజన్ గుర్తుకు 511, కెమెరా గుర్తుకు 502, ఓడ గుర్తుకు 153, చెప్పుల గుర్తుకు 2270 ఓట్లు చొప్పున వచ్చాయి. ఈ గుర్తులకు వచ్చిన ఓట్లన్నీ కారు గుర్తుగా భావించిన వేసిన ఓట్లుగా భావిస్తున్నారు.