సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 నవంబరు 2022 (15:04 IST)

రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యంలో దూసుకెళుతున్న తెరాస

munugode bypoll vote count
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా సాగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ రౌండ్‌లోనూ తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో నిలిచాడు. 
 
ఇప్పటివరకు తెరాసకు మొత్తం 52334 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 49243 ఓట్లు వచ్యాయి. దీంతో తెరాస అభ్యర్థికి మొత్తం 3091 ఆధిక్యం లభించింది. మొత్తం 15 రౌండ్లకు గాను ఇప్పటికి వరకు 8 రౌండ్లు పూర్తికా మరో ఏడు రౌండ్లు పూర్తి చేయాల్సివుంది. 
 
తొలి రౌండ్‌లో ఆధిక్యం కనపరిచిన తెరాస అభ్యర్థి ఆ తర్వాత 2, 3 రౌండ్లలో వెనుకబడిపోయింది. నాలుగో రౌండ్‌లో తిరిగి ఆధిక్యంలో వచ్చింది. అప్పటి నుంచి ఎనిమిది రౌండ్ వరకు ఆధిక్యంలోనే కొనసాగుతోంది. ఒక్క ఎనిమిదో రౌండ‌లోనే తెరాస అభ్యర్థికతి 536 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇదే ట్రెండ్ కొనసాగితే మరో రెండు మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయితే తెరాస అభ్యర్థి విజయం ఖాయమైనట్టే.