గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (16:09 IST)

పాలేరు అసెంబ్లీ స్థానం : ఈసారి హోరాహోరీ తప్పదా?

telangana assembly
తెలంగాణ రాష్ట్రంలో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇది గ్రామీణ నియోజకవర్గంగా భావిస్తారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,92,820 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 95,001 మంది పురుషులు, 97,803 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2018 తెలంగాణ ఎన్నికలలో, పాలేరులో 90.99 శాతం ఓటింగ్ నమోదైంది. 2014లో 90.32 శాతం పోలింగ్ నమోదైంది.
 
2014లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రామిరెడ్డి వెంకట రెడ్డి 21,863 (12.32శాతం) మెజార్టీతో గెలిచారు. మొత్తం పోలైన ఓట్లలో రామిరెడ్డి వెంకట రెడ్డికి 39.28 శాతం ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో, ఖమ్మం పార్లమెంటరీ/లోక్‌సభ నియోజకవర్గంలోని పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో వైకాపా ముందంజలో ఉంది. పాలేరు 
 
ఉమ్మడి జిల్లాకు స్వాగత ద్వారంగా ఉన్న పాలేరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరా హోరీగా పోటీలో ఉండగా, పొత్తులు కుదరకపోవ
డంతో సీపీఎం కూడా బరిలో నిలిచింది. దీంతో పీపీఎం అభ్యర్థి పోటీలో ఉండటంతో ఎవరికీ నష్టం అనేది చర్చనీ యాంశంగా మారింది. 
 
గత 2018లో జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్లను పరిశీలిస్తే, 
 
కాంగ్రెస్ అభ్యర్థి కె.ఉపేందర్ రెడ్డికి 89407 ఓట్లు పోలయ్యాయి. ఈయన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావుకు 81738 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ స్థానంలో మంచి పట్టున్న సీపీఐ ఎం పార్టీ తరపున పోటీ చేసిన బత్తుల హైమావతికి కేవలం 6769 ఓట్లు, నోటాకు 1271, భారతీయ జనతా పార్టీకి 1170 ఓట్లు చొప్పున పోలయ్యాయి. మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వీరిలో ఆరుగురు అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు కావడం గమనార్హం.