శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 నవంబరు 2023 (08:11 IST)

ఎన్నికల్లో పోటీకి డీకే అరుణ దూరం.. ఓటమి భయమే కారణమా?

dk aruna
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ వెల్లడించారు. పైగా, తన స్థానంలో బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని గతంలోనే తాను చెప్పినట్టు వెల్లడించారు. అదేసమయంలో బీజేపీ అభ్యర్థుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తానని ఆమె వెల్లడించారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలోని సీనియర్ మహిళా నేతల్లో డీకే అరుణ ఒకరు. అయితే, గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించిన ఆమె ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కానీ, రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. గద్వాల నుంచి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. 
 
తాను తమ పార్టీ అభ్యర్థుల తరపున తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశాలు ఉన్నట్టు మందస్తు సర్వేలు వెల్లడిస్తున్నాయి. పైగా, తెలంగాణాలో బీజేపీకి పెద్దగా పట్టు లేదు. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకనే ఆమె పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.