థియేటర్ల ఓపెనింగ్‌కు తెలంగాణ సర్కార్ పచ్చజెండా.. గైడ్‌లైన్స్ ఇవే
తెలంగాణ ప్రభుత్వం సినిమా థియేటర్ల ఓపెనింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీటింగ్‌తో తెలంగాణలో సినిమా థియేటర్లకు అనుమతి ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించింది. అయితే. థియేటర్ లో ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలని ఆదేశించింది. మరోవైపు.. టిక్కెట్ల రేట్లు పెంచుకునే అధికారం యాజమాన్యాలకు వదిలేసింది సర్కార్.
ఇక మరి కొన్ని మార్గదర్శకాలను కూడా థియేటర్స్ కి జారీ చేసింది సర్కార్. కామన్ పాయింట్స్ సహా జనాలు వాడే అన్ని ప్రదేశాలను ప్రతి ఆట పూర్తి అయ్యాక సానిటైజ్ చేయాల్సిందిగా ఆదేశించింది.
అలానే ఒక మల్టీప్లెక్స్‌లో ఒకేసారి 2,3 ఆటలు ప్రదర్శిస్తున్నప్పుడు ఆ రెండు ఆటలకు ఒకే సారి ఇంటర్వెల్ రాకుండా ప్లాన్ చేయాలని ఆదేశించింది. సినిమా థియేటర్ కి వచ్చేవారు సహా అక్కడ పనిచేసే వారు తినుబండారాలు అమ్మే వారు నిరంతరం మాస్కు ధరించి ఉండాలని ఆదేశించింది.