శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (15:37 IST)

నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని పొట్టనబెట్టుకున్న సైబర్

cyber hackers
సైబర్ నేరగాళ్ల బెదిరింపులు పెరుగుతున్నాయి. నిరక్షరాస్యులనే కాకుండా మోసపోతున్నారు. ఫోన్లు హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాలోని డబ్బును దోచుకుంటున్నారు. ఫలానా కంపెనీ నుంచి ఫోన్ చేసి ఓటీపీలు పంపి నెట్ బ్యాకింగ్ తదితర పద్ధతుల్లో కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకుంటున్నారని చెబుతున్నారు. 
 
కొంత మంది వ్యక్తుల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీన్ని మౌనంగా భరించేవారు కొందరైతే, ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసేవారు కొందరు. 
 
అయితే ఒక్కోసారి సైబర్ నేరగాళ్లు తమ బాధలు ఎవరికీ చెప్పుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సైబర్ నేరగాళ్ల బాధలు తట్టుకోలేక ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
వివరాల్లోకి వెళితే, నిజామాబాద్‌ నగరంలోని సాయినగర్‌లో హోల్‌సేల్‌ కూరగాయల వ్యాపారి యమగంటి కన్నయ్యగౌడ్‌ నివసిస్తున్నాడు. కొంతకాలం క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. దీంతో అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ తరపున కన్నయ్యగౌడ్ నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీ చేశారు.
 
అయితే తాజాగా యమగంటి కన్నయ్య గౌడ్ ఫోన్‌ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఫొటోలు తీసి మార్ఫింగ్ చేశాడు. వారితో అసభ్యకర వీడియోలు తీశారు. అనంతరం ఆ వీడియోలను అతడి ఫోన్‌కు పంపించారు. వాటి ఆధారంగా డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం ఉదయం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
 
కన్నయ్యగౌడ్‌కు భార్య, పాప ఉన్నారు. పోలీసులు కన్నయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.