బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (12:51 IST)

కరోనా హోమ్ ఐసోలేషన్ పేషెంట్ల కోసం హితమ్ యాప్

తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో చాలామందికి కోవిడ్ లక్షణాలు కనిపించట్లేదు. ఇలాంటి పేషెంట్లకు హోం క్వారంటైన్ సూచించి, తద్వారా ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐతే రాష్ట్ర ప్రభుత్వం కరోనా రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అసలు టెస్టులు చేయడం లేదంటూ తీవ్ర ఆరోపణలు, విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు వీరి కోసం ప్రత్యేకంగా హితమ్ యాప్ రూపొందించింది. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్న బాధితుల కోసం హితం యాప్ అని పేరు పెట్టింది. యాప్ చివరిదశలో టెక్నికల్ సమస్యలు చెక్ చేస్తున్నట్లు సమాచారం. వీటిని సరిచేసి అతి త్వరలోనే హోం ఐసోలేషన్ పేషెంట్ల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. 
 
ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లు కచ్చితంగా ''హితం'' యాప్ డౌన్‌డోన్ చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. దీనిద్వారా వైద్యశాఖకు సమాచారం వెళ్తుంది. వైద్యులు ఆ ఐసోలేషన్ పేషెంట్లకు సలహాలు, సూచనలు ఇస్తారు. ఏకకాలంలో హితం యాప్ ద్వారా 10వేల మందికి ఆన్‌లైన్‌లోనే సేవలు అందించే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ యాప్ ద్వారా 108కి కాల్ చేసి విషయం తెలిపేలా రూపొందించడం విశేషం.