1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (12:33 IST)

ఆ స్కూల్స్‌లో ప్రత్యక్ష బోధన ప్రమాదకరం : రీ ఓపెనింగ్స్‌పై నేడు విచారణ

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల తలుపులు తెరుచుకోనున్నాయి. కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా మూతబడిన ఈ పాఠశాలలు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తెరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం విద్యాసంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 
కోరనా మూడ దశ అల పొంచివుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పేరెంట్స్ అనుమతిని ప్రభుత్వం తప్పనిసరిచేసింది. దీంతో ఆన్‌లైన్‌ క్లాసులు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్‌లైన్ క్లాసులకు రాలేనివారికి ఆన్‌లైన్‌లో కూడా క్లాసులు అందుబాటులో ఉండేలా విద్యా సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
 
ఇదిలావుంటే, పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై ప్రైవేట్‌ స్కూల్ టీచర్ బాలకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ క్లాసులకూ ప్రత్యక్ష బోధన ఆందోళనకరమని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యక్ష బోధన సరికాదన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ఈ వ్యాజ్యాన్ని స్వీకరించిన తెలంగాణ హైకోర్టు.. ఈనెల 31న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.