తెలంగాణలో కొత్తగా 331 కేసులు.. ముగ్గురు మృతి

telangana covid
telangana covid
సెల్వి| Last Updated: బుధవారం, 13 జనవరి 2021 (13:18 IST)
తెలంగాణలో కొత్తగా 331 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,640కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

మంగళవారం కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,571కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 394 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,84,611కి చేరింది.

ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,458 ఉండగా వీరిలో 2,461 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 73,50,644కి చేరింది.దీనిపై మరింత చదవండి :