రాజకీయాల్లోకి రాను.. ఆరోగ్యమే ముఖ్యం.. నన్ను ఇబ్బంది పెట్టకండి
కొన్నేళ్ల పాటు రాజకీయాల్లోకి వస్తానంటూ.. మళ్లీ వచ్చేది లేదంటూ ప్రకటనలు చేస్తూ వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. తాజాగా తాను రాజకీయాల్లోకి రావడం లేదంటూ సంచలన ప్రకటన చేశారు.. అయితే, ఈ ప్రకటనను రజనీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన రాజీకీయాల్లోకి రావాల్సిందేనంటూ ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు.. దీంతో.. తన రాజకీయ రంగ ప్రవేశంపై అభిమానులకు మరోసారి క్లారిటీ ఇచ్చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్
తాను రాజకీయాల్లోకి రానని, ఆరోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రాలేనని.. తన నిర్ణయాన్ని తాను ఇది వరకే వివరించానని చెప్పిన తలైవా.. దయచేసి ఇంకెవ్వరూ తనను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించి ఇబ్బంది పెట్టవద్దంటూ కోరారు. అభిమానులు ర్యాలీలు, ధర్నాలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేసిన రజనీకాంత్.. రాజకీయ ఎంట్రీపై మనసు మార్చుకునే అవకాశం లేదని మరోసారి క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.