గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By డివి
Last Modified: సోమవారం, 4 జనవరి 2021 (12:52 IST)

స్వామిజీ ఆశీర్వాదం తీసుకున్న ర‌జ‌నీకాంత్‌, అమెరికా వెళ్తారట..

సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. అటు సినిమాలు, ఇటు రాజ‌కీయ ప్ర‌వేశం రెండు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. త‌న ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో రాజ‌కీయ పార్టీకి గుడ్‌బై చెబుతున్న‌ట్లు తేల్చిచెప్పారు.  ఇందుకు త‌మిళ‌నాడులో ఆయ‌న అభిమానులు చాలా నిరాశ‌తో వున్నారు. అయినా ముందు ఆరోగ్యం చూసుకోవాల‌ని అమెరికాకు వెళ్లే ప్ర‌య‌త్నంలో వున్నారు. అయితే ముందుగా ర‌జ‌నీ దంప‌తులు నమో నారాయణస్వామి ఆశీస్సులు అందుకున్నారు.
 
ర‌జ‌నీ ప‌రిస్థ‌తి చూసిన స్వామిజీ స్వ‌యంగా ర‌జ‌నీకాంత్ ఇంటికి వ‌చ్చి ఆయ‌న‌తో అర‌గంట సేపు ముచ్చ‌టించారు. ప‌లు విష‌యాల‌పై వీరిద్ద‌రు ముచ్చ‌టించుకున్నారట. వెళ్లేముందు ర‌జ‌నీకాంత్ దంప‌తుల‌కు ఆశీస్సులు అందించారు. అనారోగ్యానికి గురైన త‌ర్వాత రజనీని పరామర్శించేందుకు ఎవరికీ అనుమతి లేదని మక్కల్‌ మండ్రం వర్గాలు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో స్వామిజీ ఎంట్రీ ఆస‌క్తిక‌రంగా మారింది.
 
అన్నాత్తె చిత్ర షూటింగ్ కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ అనారోగ్యానికి గురైన సంగ‌తి తెలిసిందే. మ‌రి ర‌జ‌నీ షూటింగ్ పూర్తి చేస్తాడా లేదా.. అనేది ప‌క్క‌న పెడితే.. ఆరోగ్యం కోసం స్వామిజీ ఆశీస్స‌లు తీసుకున్నాడ‌ని సన్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.