శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (12:39 IST)

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణలో స్కూల్స్ ప్రారంభం

తెలంగాణలో కరోనా ఉధృతితో మూ పడ్డ విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.  ఆదివారంతో ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ముగియనున్నాయి.
 
ఈ నేపథ్యంలో తెలంగాణలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.  
 
కరోనా కేసుల తగ్గుదల, తీవ్రత లేకపోవడతో తిరిగి విద్యాసంస్థలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ 8, 9, 10 తరగతులకు కూడా ఆన్ లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నారు.