1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (17:56 IST)

టీడీపీ అప్పుల విలువ రూ.30.342 కోట్లు.. ఆస్తుల్లో తెలంగాణ..?

దేశంలోని రాజకీయ పార్టీల ఆస్తులు ప్లస్ అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను ఏడీఆర్ తెలిపింది. 
 
2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను అన్ని పార్టీల్లోకి బీజేపీకి అత్యధికంగా రూ.4,847.78 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్టు వెల్లడైంది. ప్రాంతీయ పార్టీల్లో అధిక ఆస్తుల పట్టికలో రెండోస్థానంలో తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ పార్టీకి రూ.301.47 కోట్ల ఆస్తులున్నాయి. 
 
జాతీయ పార్టీల అప్పుల విషయానికొస్తే... కాంగ్రెస్ అగ్రభాగాన నిలుస్తుంది. హస్తం పార్టీకి రూ.49.55 కోట్ల అప్పులున్నాయట. తర్వాత స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ (రూ.11.32 కోట్లు) ఉంది.
 
ప్రాంతీయ పార్టీల సంగతి చూస్తే... టీడీపీకి అత్యధిక అప్పులు ఉన్నాయి. టీడీపీ అప్పుల విలువ రూ.30.342 కోట్లు. రూ.8.05 కోట్ల అప్పుతో డీఎంకే రెండోస్థానంలో ఉంది.