గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (14:25 IST)

తెలంగాణాలో ఉధృతంగా సెకండ్ వేవ్ : నైట్ కర్ఫ్యూకు మొగ్గు?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ఉధృతంగాసాగుతోంది. దీంతో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలన్న విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందిది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
 
రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉండడంతో ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది. కేంద్రం ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అలాగే పాక్షిక లాక్డౌన్ కూడా అమలు చేస్తున్నారు. 
 
ఇప్పుడు తెలంగాణలోనూ రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని శాఖల ముఖ్య అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియవచ్చింది.
 
మరోవైపు, గడిచిన 24 గంటల్లో తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా 3,307 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 897 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,045కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,08,396 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య  1,788కిగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 27,861 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 18,685 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 446 మందికి క‌రోనా సోకింది.