Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూకట్‌పల్లిలో పార్క్ చేసినవున్న మూడు బస్సులకు నిప్పు

Written By ఠాగూర్
Updated: సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (12:57 IST)
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో పార్కింగ్ చేసివున్న మూడు బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఈ మూడు బస్సులు మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయాయి. అయితే, ఈ మూడు బస్సులకు నిప్పు ఎలా అంటుంకుందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఏదేని కుట్ర కోణం ఉండివుంటుందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
 
కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద పార్క్ చేసివున్న భారతీ ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సులు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రాంతంలో ప్రతి రోజూ భారతీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులును పార్కింగ్ చేస్తూ ఉంటారు. అయితే, వాటిలో మూడు బస్సులకు సోమవారం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ట్రావెల్స్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. 
 
స్థానిక పోలీసులతో పాటు అగ్నిమాపకదళ శాఖకు కూడా సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఫైరింజన్ల సాయంతో అదుపులోకి తెచ్చాయి. అయితే, ఈ బస్సులకు ఉన్నట్టుండి మంటలు చెలరేగడంపై పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదవశాత్తు బస్సులకు మంటలు అంటుకున్నాయా? లేదా ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా అంటించారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments