పాల్వంచలో పెద్దపులి అలజడి.. ఆ పులి గర్భంతో వుండవచ్చు..
ఖమ్మం జిల్లాలోని పాల్వంచ మండలంలో పెద్దపులి సంచరిస్తోందని.. అందరూ జాగ్రత్తగా వుండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతంలో పెద్దపులి అలజడి సృష్టించడంతో మండలంలోని ప్రభాత్ నగర్, ఆయిల్‌పాం సమీప ప్రాంతాల్లో పులి పాదముద్రలను అక్కడి స్థానికులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ అధికారులు ఆ ప్రాంతాలను పరిశీలించారు.
ఆ పాదముద్రలు పులివేనని నిర్ధారించారు. వాటి నమూనాలను సేకరించారు. 'ఈ ప్రాంతంలో పులి సంచించినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. అటవీప్రాంతాల్లో ఒంటరిగా తిరగొద్దు. అవసరమైతే గుంపులుగా వెళ్లాలి. ట్రాక్టర్ హారన్‌ను పదే, పదే మోగించకూడదు' అని అధికారులు సూచించారు. 'ఆ పులి గర్భంతో ఉండవచ్చు. సురక్షిత ప్రాంతం కోసం తిరుగుతున్నట్లున్నది. అడవులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి' అని హెచ్చరించారు.