Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుస్సేన్ సాగర్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

Written By ఎం
Updated: బుధవారం, 4 సెప్టెంబరు 2019 (08:38 IST)
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.

ప్రతి రోజు  మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పుస్కరించుకొని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కర్బాలా మైదాన్ నుంచి వచ్చే సాధారణ వాహనాలను అప్పర్ ట్యాంక్ బండ్ మీదికి అనుమతించకుండా కవాడీగూడా చౌరస్తా వైపు పంపుతారు.

లిబర్టీ వైపు వెళ్లాల్సిన వాహనాలు కవాడీగూడా చౌరస్తా, గాంధీనగర్ టి. జంక్షన్, డీబీఆర్ మిల్స్, ఇందిరాపార్క్, దోమలగూడా మీదుగా వెళ్ళాలి. ఖైరతాబాద్, పంజాగుట్ట వైపు వెళ్లాల్సిన వాహనాలు రాణీగంజ్, నల్లగుట్ట, సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్ళాలి.

ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి వచ్చే సాధారణ వాహనాలను ఎన్టీఆర్ మార్గ్ లోకి అనుమతించకుండా నెక్లెస్ రోడ్డు లేదా మింట్ కాంపౌడ్ వైపు పంపిస్తారు. తెలుగుతల్లి విగ్రహం నుంచి వాహనాలను ఎన్టీఆర్ మార్గ్ లోకి అనుమతించకుండా ఇక్బల్ మీనార్ వైపు పంపిస్తారు.

సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కట్ట మైసమ్మ ఆలయం, డీబీఆర్ మిల్స్, చిల్డ్రన్ పార్క్, సెయిలింగ్ క్లబ్, కర్బాలా మైదాన్ మీదుగా మళ్లిస్తారు. గోశాల  అప్పర్ ట్యాంక్ బండ్ వైపుగా వెళ్లే వాహనాలను డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా పంపిస్తారు.

అన్నీ చూడండి

Sree Vishnu: ఫ్యామిలీ ప్యాక్ తో సంక్రాంతి పోటీగా రాబోతున్న శ్రీ విష్ణు

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

తర్వాతి కథనం
Show comments