సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (07:30 IST)

తెరాస ఎమ్మెల్సీ వాణీదేవికి కరోనా వైరస్ : మద్యం షాపులు బంద్

తెరాస ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా వైరస్ సోకింది. పరీక్షలు చేయించుకున్న ఆమెకు పాజిటివ్ అని వెల్లడైంది. ఈ విషయాన్ని సురభి వాణీదేవి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని, ఐసోలేషన్ లోకి వెళ్లాలని సూచించారు. 
 
కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు . వాణీదేవి ఇటీవలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈవిషయాన్ని ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తనతో ఇటీవల కాంటాక్ట్ అయినవారు ఐసోలేషన్లో ఉండాలని , కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
 
మరోవైపు, ఈ నెల 29,30 తేదీలు హోళీ కారణంగా తెలంగాణలో ఇవాళ, రేపు రెండు రోజులపాటు మద్యం షాపులు తెరిచి ఉండడం లేదు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకు మద్యం షాపులను మూసేస్తున్నారు.