ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (20:13 IST)

తెలంగాణాలో ప్రవేశ పరీక్షల తేదీల ఖరారు - ఎంసెట్ ఎపుడంటే...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రవేశ పరీక్షల (సెట్)ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఓ కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన తేదీలను ఖరారు చేసింది. ఆగస్టులో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. 
 
ఈ మేరకు అధికారులు ఆగస్టు 4 నుంచి 10వ తేదీ వరకు ఎంసెట్‌ ఎంటన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 4,5, 6 తీదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్, 9,10న ఎంసెట్ ఏఎం పరీక్షలు జరుగుతాయి ఆగస్టు 3న ఈసెట్‌, ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు పీజీఈ సెట్‌ నిర్వహిస్తారు. ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్‌, ఆగస్టు 23వ తేదీన లా సెట్‌, 24, 25 తేదీల్లో ఎడ్‌ సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
కాగా ఇప్పటికే జరగాల్సిన సెట్ పరీక్షలు కరోనా కారణంగా ఆలస్యమయ్యాయి. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, లాక్డౌన్ ఎత్తివేయడంతో విద్యాశాఖ సెట్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. విద్యాశాఖ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా సెట్ పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటించింది.