ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (22:17 IST)

జింక మాంసం అని కుక్క మాంసాన్ని అమ్ముతున్నారు..!

dogs
డబ్బు కక్కుర్తితో కేటుగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. అలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. జింక మాంసం అని చెప్పి కుక్క మాంసం అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్ష్మణచందా గ్రామంలో ఆనంద్ అనే వ్యక్తి పెంచుకుంటున్న ఓ పెంపుడు కుక్కను దొంగిలించి.. జింక మాంసం అంటూ దుండగులు విక్రయించారు. 
 
సీసీటీవీలో కుక్క దొంగతనానికి సంబంధించిన వీడియో రికార్డు అయ్యింది. కుక్క కనిపించటం లేదని ఆనంద్ నుంచి ఫిర్యాదు రావటంతో పోలీసులు రంగంలోకి దర్యాప్తులో షాకింగ్ నిజాలను వెలుగులోకి తెచ్చారు.