ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శనివారం, 22 మే 2021 (22:08 IST)

కెసిఆర్ పైన రాములమ్మ ఆగ్రహం, కేసు పెట్టాలంటూ...

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ఎంపి, బిజెపి నాయకురాలు విజయశాంతి. పిపిఈ కిట్ లేకుండా గాంధీ, ఎంజీఎం ఆసుపత్రిలో తిరిగిన సిఎంపై కేసు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణాలో అరాచక పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. 
 
ఆరోగ్యశ్రీలోకి వెంటనే కరోనా చికిత్సను చేర్చాలని.. ఆరోగ్యశ్రీ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలన్నారు. అలాగే కోవిడ్ నిబంధనలకు లోబడి పిపిఈ కిట్ వేసుకుని ఆసుపత్రికి వెళితే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేసులు బనాయిస్తారా అంటూ ప్రశ్నించారు. 
 
రోజు లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వాళ్ళపై ఎంతమందిపై కేసులు పెట్టి కోర్టు ముందు ప్రవేశపెడతారు. సిద్ధిపేట హరీష్ రావు చెప్పుకుంటున్న అభివృద్ధి అంతా డొల్ల అని తేలిపోయిందన్నారు. సిద్ధిపేట ఆసుపత్రిలో కరోనా పేషెంట్లను పట్టించుకోవట్లేదని వాళ్ళ బంధువులు, టిఆర్ఎస్ నేతలే వీడియో మెసేజ్‌లు పంపుతున్నారన్నారు. 
 
సిద్థిపేట సర్కార్ దవాఖానాలకు పోతే చచ్చినట్లేనని.. పేషెంట్ల బంధువులు చెబుతుంటే అక్కడి చిన్నదొరకు ఫామ్ హౌస్ పెద్ద దొరకు వినిపించ లేదా అంటూ ప్రశ్నించారు. వాస్తవాలు చూసేందుకు ఆసుపత్రికి వెళ్ళిన సిద్ధిపేట బిజెపి జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణారెడ్డి, ప్రధాన కార్యదర్సి పద్మగౌడ్ పై కేసులు పెట్టడం సరైంది కాదన్నారు.