Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చుక్కలు చూపించిన ఓటర్లు

Written By ఎం
Updated: ఆదివారం, 22 నవంబరు 2020 (19:41 IST)
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఓట్లు అడిగేందుకు వచ్చిన  హైదరాబాద్ మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు యాప్రాల్ ప్రజలు చుక్కలు చూపించారు. నో రోడ్స్.. నో ఓట్స్, రోడ్డు వేయండి.. ఓటు అడగండి అనే ప్లకార్డులతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు.
 
స్థానికుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన సెగ తగలడంతో ఎన్నికలు అయిపోగానే సొంత నిధులతో రోడ్లు వేయిస్తానంటూ తన లెటర్ ప్యాడ్‌పై సంతకం చేసి మరీ ఎమ్మెల్యే మైనంపల్లి వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా తలపై చేయివేసుకుని ప్రమాణం కూడా చేశారు.

దీంతో ఓటర్లు శాంతించారు. సొంత నిధులు అవసరం లేదని, జీహెచ్ఎంసీకి తాము ట్యాక్స్‌లు కడుతున్నామని, ప్రజాధనంతోనే తమకు రోడ్లు వేయాలని ఓటర్లు డిమాండ్ చేశారు. తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు తప్పకుండా న్యాయం చేస్తానని మైనంపల్లి హనుమంత రావు హామీ ఇచ్చారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments