శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (09:51 IST)

ఫిబ్రవరి 11వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక..?

డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, మేయర్ ఎంపిక ఇప్పటి వరకు జరగలేదు. మేయర్ ఎన్నికకు సంబంధించిన ఎన్నికల సంఘం ఓ ప్రకటన చేసింది. ఫిబ్రవరి 11వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుందని ప్రకటించింది. కొత్తగా ఎన్నికైన సభ్యుల వివరాలను తెలంగాణ స్టేట్ గెజిట్‌లో ప్రచురిస్తామని తెలిపింది. 
 
జీహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఎన్నికల సమయంలో చేసిన ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని కోరింది. వివరాలు అందించని వ్యక్తులు భవిష్యత్తలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. 
 
గెజిట్‌లో జనవరి 11 న వివరాలను ప్రచురించే అవకాశం ఉంది. జనవరి 11న గెజిట్‌లో ప్రచురిస్తే, ఫిబ్రవరి 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. మరి మేయర్ పీఠం ఎవర్ని వరిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 11 వరకు ఆగాల్సిందే.